MOHINI AVATARAM CASTS MAGIC SPELL ON DEVOUT _ మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

GALLERIES BRIM WITH DEVOTEES 

Tirumala,22 September 2023:   All galleries looked jam-packed on the fifth day morning of Thursday, as part of ongoing annual brahmotsavams in Tirumala, where Sri Malayappa Swamy mesmerised the devotees in His “Mohini” avatar in a tastefully decked palanquin accompanied by Sri Krishna Swamy on another Pallaki.

While all the other Vahana Sevas were carried by some divine flora and fauna as vehicles start from Vahana Mandapam, here the Lord pulls out Himself from the Srivari temple, gracefully, on a colourfully decorated palanquin, bejewelled, well dressed sporting a parrot in one hand, sitting majestically, charming devotees with His divine beauty. 

According to legends, the Lord’s appearance as bejewelled and charming Mohini throws the demons (Asura) in confusion and wins the celestial battle in favour of the deities (Devatas). The objective of the Mohini avatar is also to indicate that the entire universe is spellbound under the Mystic “Moha” and that the Lord of Tirumala is the kingpin or key architect of this celestial drama happening across the universe. The message is that devotees should come out of this “Maya” and lead a righteous, spiritual life.

The TTD Chairman Sri Bhumana Karunakar Reddy, TTD EO Sri AV Dharma Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

2023 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

తిరుమల, 2023 సెప్టెంబరు 22: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం
       
 ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

గ‌రుడ వాహ‌నం

రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.