MOHINI AVATARAM MESMERISES _ పల్లకీలో మోహినీ అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
Tirupati, 11 June 2025: On the morning of the fifth day, the Utsava Idol of Sri Prasanna Venkateswara Swamy was taken out in a richly adorned palanquin in the guise of Mohini Avatara as part of the ongoing annual Brahmotsavams.
This unique manifestation is considered significant as it represents the celestial enchantress Mohini, who appeared to protect the world by distributing the divine nectar among the Gods and preventing it from falling into the hands of demons.
Temple DyEO Officer Sri Harindranath, AEO Sri Devarajulu, temple staff, and a large number of devotees participated.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పల్లకీలో మోహినీ అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
తిరుపతి, 2025, జూన్ 11: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గం.లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు పల్లకీలో మోహినీ అవతారోత్సవంలో భక్తులను అనుగ్రహించారు.
ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9.30 – 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ జరుగనుంది .
బుధవారం రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.