MOHINI AVATARAM ON DAY FIVE _ మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు
మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు
తిరుపతి, 2021 జూన్ 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు.
సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినప్పుడు అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంలో సాక్షాత్కరించారు. సమ్మోహనమైన ఆమె చూపులకు అసురులు పరవశులైపోయి ఉండగా , దేవతలకు అమృతం అనుగ్రహించడం జరిగింది.
కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణా రెడ్డి, కంకణభట్టార్ శ్రీసూర్యకుమార్ ఆచార్యులు, ఇతర ఆధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 23 Jun. 21: On the fifth day morning and ongoing annual brahmotsavams at Appalayagunta, Sri Prasanna Venkateswara graced as Mohini to bless devotees.
Due to Covid norms the event took place in Ekantam.
AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Gopalakrishna Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI