MOHINI MESMERISES ON PALLAKI _ పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ
Tirupati, 02 December 2024: The celestial universal damsel, Mohini seated impressively inside the finely decked palanquin blessed Her devotees on Monday.
On the fifth morning of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, Sri Padmavati Devi in the guise of Mohini Avataram decked in dazzling jewels and colourful robes conquered the hearts of tens of thousands of devotees who have converged in the mada streets.
Both the pontiffs of Tirumala, TTD EO Sri J Syamala Rao, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ
తిరుపతి, 2024 డిసెంబరు 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.
ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వసంతోత్సవం నిర్వహిస్తారు.
గజ వాహనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుండి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఈవో శ్రీ జె.శ్యామల రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.