MOHINI MESMERIZES _ మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

TIRUPATI, 06 JUNE 2025: The divine universal damsel, Jagan Mohini mesmerized the devotees on the fifth morning of the ongoing annual Brahmotsavams at Sri Govindaraja Swamy temple in Tirupati.

On the Friday, the Utsava deity of Sri Govindaraja Swamy decked in colourful silks and dazzling jewels glittered on the palanquin.

Later Snapanam will be performed to the utsava deities.

DyEO Smt Shanti, other temple staff, and devotees were present.

SPECIAL VASTRAMS

As part of the Sri Govindaraja Swamy Brahmotsavam, on Friday evening between 4 and 5 pm, a procession of new clothes and Thiruvadi will be taken to the Sri Govindaraja Swamy temple from Komalamma Satram via Bazaar Street, Gandhi Road, four Mada Streets, and Sannidhi Street. 

At 6 pm, the ornament presented from Tirumala Sri Venkateswara Swamy will be taken to the Sri Govindaraja Swamy temple from Sri Eduru Anjaneya Swamy temple. 

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి, 2025, జూన్ 06: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు.

భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో హేయమైన విషంతోపాటు ఉపాదేయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచింపబడడం, దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది.

అనంతరం ఉదయం 10 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, పలువురు ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.