MUTYAPU PANDIRI VAHANAM HELD _ ముత్యపుపందిరిపై ధనలక్ష్మి అలంకారంలో అల‌మేలుమంగ‌

TIRUPATI, 19 NOVEMBER 2025: The third sunny morning  witnessed Sri Padmavati Devi in the guise of the Goddess of Riches-Sri Dhana Lakshmi Devi at Tiruchanoor.

On Wednesday, as a part of ongoing Karthika Brahmotsavams, the vahana seva, commenced at 8 a.m. and witnessed enthusiastic participation from devotees.

Watching the white pearl canopy believed to grant relief from suffering and leads them towards spiritual bliss.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD Executive Officer Sri Anil Kumar Singhal, JEO Sri Veerabrahmam, Temple Deputy EO Sri Harindranath, Chief Priest Sri Babu Swamy, other officials, and a large number of devotees participated in the vahana sevas.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ముత్యపుపందిరిపై ధనలక్ష్మి అలంకారంలో అల‌మేలుమంగ‌

తిరుపతి, 2025 నవంబరు 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.

వాహనసేవల్లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.