MUTYAPU PANDIRI VAHANAM HELD _ ముత్యపుపందిరి వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి దర్శనం
Tirupati, 29 March 2025: The annual Brahmotsavam at Sri Kodandarama temple in Tirupati witnessed Sri Rama taking a ride on the finely decked Mutyapu Pandiri Vahanam.
Devotees were thrilled to see the Utsava deities on the Mutyapu Pandiri Vahanam on Saturday evening.
The paraphernalia, dance troupes enhanced the grandeur of the Vahana Seva.
Both the Senior and Junior Pontiffs of Tirumala, DyEO Smt Nagaratna and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి దర్శనం
తిరుపతి, 2025 మార్చి 29: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.
మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది