MYTHOLOGICAL CHARACTERS OUTSHINE _ చంద్రప్రభ వాహనం సేవలో భక్తులను ఆకట్టుకున్న 9 రాష్ట్రాల కళా ప్రదర్శనలు
Tirumala, 30 September 2025: The mythological characters portrayed by various artistes outshine on seventh evening.
The displays and dances including Gangavatara Roopakam, Asta Lakshmi Vaibhavam, Rukmini Vijayam, Krishna Mahima, Goda Kalyanam and other artforms amazed the devotees.
On totto 21 teams with 491 artistes from Nine States performed their skills to impress devotees on the occasion of Chandra Prabha Vahanam on Tuesday evening.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
చంద్రప్రభ వాహనం సేవలో భక్తులను ఆకట్టుకున్న 9 రాష్ట్రాల కళా ప్రదర్శనలు
తిరుమల, 2025 సెప్టెంబరు 30: చంద్రప్రభ వాహనం సేవలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల నుండి వచ్చిన 21 కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కళాకారుల అద్భుత ప్రదర్శనలు వాహన సేవలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచాయి.
ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి 21 బృందాలలలో491 మంది కళాకారులు భరతనాట్యం,
మోహినియాట్టం, కథాకళి, గౌడీయ నృత్యం, కృష్ణ మహీమ, గంగావతార్ రూపకం, శ్రీ రుక్మిణీశ విజయ, రసమయి గోవింద స్మృతి, మంజునాథ చరితం ప్రదర్శించారు.
ఉత్తరాఖండ్ కు చెందిన కళాకారులు జానపద నృత్యాలు, హరుల్ చోళియ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళాకారుల కోలాటం, మహారాష్ట్ర – వారాకరీ భజన, జానపద నృత్యం, బతుకమ్మ, భాంగ్రా భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
అదేవిధంగా గోదాదేవి కళ్యాణం, అష్టలక్ష్ములు, అళ్వార్ వేశ ధారణ, డ్రమ్స్ ప్రదర్శన భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించాయి.
వివిధ రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళనం భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.





































