MYTHOLOGICAL EPISODES CAST MAGIC _ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్ప  ప్రదర్శనశాల

TIRUPATI, 10 NOVEMBER 2023: The decorations by TTD Garden wing in the flower expo set up in the Friday Gardens has been attracting the devotees.

The colourful decorations included some mythological episodes viz. Somakasura Vadha-Chaturveda Parirakshana, Annamacharya with his two wives offering prayers before Sri Venkateswara, Sri Krishna and Bheemasena in Lakshagriha, Lava-Kusa with Sri Rama and many other interesting episodes besides vegetable artforms and floral decorations providing a cynosure.

The display by Ayurveda, Sculptural Institutions also stood out.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్ప  ప్రదర్శనశాల
 
తిరుపతి, 2023  నవంబరు 10: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా  తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
 
ఇందులో టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ‘సోమకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి నాలుగు వేదాలను బ్రహ్మకు  మత్స్య అవతారంలో అందిస్తున్న శ్రీమహావిష్ణువు ప్రతిమలు ఏర్పాటు  చేశారు . అరణ్యవాసమున సీతమ్మను వెతుకుతూ వెళ్లిన శ్రీరామ లక్ష్మణులకు పండ్లు, తేనే ఆతిథ్యమిస్తున్న భక్త శబరి ప్రతిమల నమూనా  భక్తులను ఆకర్షిస్తోంది . వాల్మీకి మహర్షి ఆశ్రమంలో శ్రీరామ కథను ఆలపిస్తున్న లవకుశులు, లక్క గృహంలో నిద్రిస్తున్న భీమసేనుడిని  పాటతో మేల్కొలుపుతున్న ముసలి రూపంలో శ్రీకృష్ణుడు ప్రతిమలు ఏర్పాటు  చేశారు . అర్జునుడు బాణాలతో స్వర్గానికి నిర్మించిన నిచ్చెనతో ఐరావతాన్ని తీసుకురావడానికి బయలుదేరుతున్న భీమసేనుడు, అన్నమయ్య తన ఇద్దరు భార్యలతో శ్రీవారిపై కీర్తనలను ఆలపిస్తున్న ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి .
వివిధ పుష్పాలతో ఏర్పాటు చేసిన జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
 
అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్‌పో ఆయు, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు  చేశారు. 
   
ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఏర్పాటు  చేసిన శిల్ప కళ ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.