NAGALAPURAM BTU BEGINS WITH DWAJAROAHANAM _ ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2021 ఏప్రిల్ 26: నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చిపై వేంచేపు చేసి, మిథున లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కాగా రాత్రి 8 గంటలకు ఆలయంలో పెద్దశేష వాహనసేవ జరుగనుంది.
ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాతంగా వాహనసేవ జరుగనుంది.
తేదీ ఉదయం సాయంత్రం
27-04-2021 చిన్నశేష వాహనం హంస వాహనం
28-04-2021 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
29-04-2021 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
30-04-2021 మోహినీ అవతారం గరుడ వాహనం
01-05-2021 హనుమంత వాహనం గజ వాహనం
02-05-2021 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-05-2021 రథోత్సవం బదులు
సర్వభూపాల వాహనం ఆర్జితకల్యాణోత్సవం/అశ్వవాహనం
04-05-2021 చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 3వ తేదీన సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం ఆలయంలో ఏకాంతంగా జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నాగరాజ బట్టర్, కంకణ బట్టర్ శ్రీ సాయిక్రిష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నందకుమార్, శ్రీ ఉదయ్‌కుమార్‌ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
Tirupati, 26 Apr. 21: The annual Brahmotsavam of Sri Vedavalli sameta Vedanarayana temple, Nagulapiram commenced on Monday with Dwajarohanam held in ekantham due to Covid guidelines.
Earlier the Utsava idols were paraded in a Tiruchi and later the Dwajarohanam was conducted in the Mithuna lagna, between 9.30-11.30 am.
As part of festivities, Pedda Sesha Vahana seva will be conducted in night at 8.00 pm.
As part of the nine-day festival, the TTD is organising vahana sevas in ekantham at morning and night.
Following are details:
April 27: Chinna Sesha Vahana (m Hamsa vahana (n)
April 28: Simha vahana (M) and Muthyapu pandiri (n)
April 29: Kalpavruksha (M). And Sarva Bhupala (N).
April 30: Mohini (m) and Garuda (n)
May 1: Hanumanta (m) Gaja (n)
May2: Surya Prabha (m) Chandra Prabha (n)
May 3. Sarva Bhupala vahana instead of Rathotsavam (m) and Aswa and arjita Kalyanotsavam (e)
May 4: Chakra snanam (m) and Dwajavarohanam (n)
TTD special grade DyEO Smt Parvati, AEO Sri Durga Raju, chief Archaka Sri Nagaraj Bhattar, Kankana bhattar Sri Sai Krishna, temple inspectors, Sri Nanda Kumar and Sri Uday Kumar, other staff and archakas were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI