NAMA SANKEERTANS ALLURES _ తిరుపతిలో అలరించిన ధార్మిక కార్యక్రమాలు
TIRUMALA, 08 OCTOBER 2024 : The devotees were delighted by the powerful Nama Sankeertana by renowned Nama Sankeertana experts from Tamilnadu at Nada Neerajanam.
The Vishnu Sahasranamam echoed in Astana Mandapam.
Similarly cultural events at Mahati, Annamacharya Kalamandiram and Sri Ramachandra Pushkarini impressed denizens in Tirupati.
తిరుపతిలో అలరించిన ధార్మిక కార్యక్రమాలు
తిరుమల, 2024 అక్టోబరు 08 ; తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలతో పురప్రజలు పులకించారు.
ఇందులో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో కరైకల్ కు చెందిన నాట్యాలయ భరతనాట్యం అకాడమీ వారు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు నృత్య ప్రదర్శన నిర్వహించారు.
అన్నమాచార్య కళామందిరంలో తిరుపతికి చెందిన శ్రీ రఘునాథ్ బృందం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు గాత్ర సంగీతం ఆహుతులను ఆకట్టుకుంది.
రామచంద్ర పుష్కరణ వద్ద హైదరాబాదుకు చెందిన శ్రీ శేషాచార్యులు బృందం భక్తి సంగీత కార్యక్రమం పురప్రజలను అలరించింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.