NAMA SANKEERTANS ALLURES _ తిరుమలలో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు

TIRUMALA, 08 OCTOBER 2024: The devotees were delighted by the powerful Nama Sankeertana by renowned Nama Sankeertana experts from Tamilnadu at Nada Neerajanam.

The Vishnu Sahasranamam echoed in Astana Mandapam.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 08;శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరుమల నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.

తిరుమల నాద నిరాజనం వేదికపై ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన అధ్యాపకులు శ్రీమతి లక్ష్మీ సువర్ణ, శ్రీ మల్లేశ్వరరావు, శ్రీ చంద్రశేఖర్, శ్రీ అశోక్ బృందం మంగళ్ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీరామ సలక్షణ గణపాటి ‘ వేదం- భగవత్ విశ్వాసం’ అనే అంశంపై ఉపన్యాసించారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ రాంప్రసాద్, శ్రీ రవికుమార్ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి శ్రీవాణి బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రవిచంద్ర, శ్రీమతి తేజవతి బృందం భక్తి సంగీత కార్యక్రమం, ఉదయం 11:30 నుండి 12:30 గంటల వరకు శ్రీ శ్రీనివాస వరదన్ ‘వేదాంత దేశికులు- శ్రీవారు’ అనే అంశంపై ఉపన్యసించారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీ మధుసూదన్ రావు బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అనంతరం సాయంకాలం 5:30 రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి పూర్ణ బృందం హరికథ గానం చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.