NARAYANAVANAM TEMPLE READY FOR DWAJAROHANAM _ శాస్త్రోక్త అంకురార్పణతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

Tirupati, May 27, 2026: Annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy at Sri Kalyana Venkateswara Swamy Temple commenced grandly on Wednesday night with the traditional Ankurarpanam performed as per Agama rituals.

Mrutsangrahanam and Senadhipati Utsavam were conducted with devotion from 7.30 pm to 9.30 pm, followed by Ankurarpanam amid Vedic chants. The temple wore a spiritual look on the occasion.

Dwajarohanam will be held on Thursday between 7.30 am and 9.00 am in Mithuna Lagnam.

All arrangements for the Brahmotsavams have been completed. Decorative rangolis and special facilities have been arranged for devotees.

Temple Inspector Sri Nagaraju, priests and officials participated in the event.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

పుణ్యధ్వజారోహణానికి సిద్ధమైన నారాయణవనం

శాస్త్రోక్త అంకురార్పణతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

తిరుపతి, 2026 మే 27: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించి వైభవంగా శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా రాత్రి 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.

మే 28 ధ్వజారోహణం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మిథున లగ్నంలో ఉదయం 7.30 గంటల నుండి 9.00 గంటల వరకు ధ్వజారోహణ మహోత్సవం ఆగమోక్తంగా జరుగనుంది.

బ్రహ్మోత్సవాల కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాలను రంగవల్లులతో సుందరంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు,  ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది