NAVANEETA KRISHNA MUSES ON CHANDRA PRABHA _ చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై నవనీతకృష్ణునిగా కటాక్షం

Tirupati, 25 Jun. 21: On the seventh day of the ongoing annual mega religious fete in Appalayagunta, Sri Prasanna Venkateswara took a celestial ride on Chandraprabha Vahanam.

Decked as Navaneeta Krishna, holding butter ball in his hand, the deity appeared in His cool guise on the Moon Carrier.

Temple DyEO Smt Kasturi Bai and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై నవనీతకృష్ణునిగా కటాక్షం

తిరుపతి, 2021 జూన్ 25: అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్ర‌వారం సాయంత్రం స్వామివారు నవనీతకృష్ణుని అలంకారంలో చంద్ర‌ప్ర‌భ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించారు.

ఔషధీశుడైన చంద్రుడు కూడా మనకు పోషకుడే.
ఆ ఔషధులు లేకపోతే మానవులకు జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను ఆహ్లాదపరుస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.