NAVANEETHA KRISHNA STEALS THE HEARTS _ నవనీత కృష్ణుడిగా అలరించిన ఒంటిమిట్ట రామయ్య

Vontimitta /Tirupati 30 March 2026: The annual Brahmotsavams at Vontimitta Sri Kodandarama Temple entered fourth day on Monday.

As a part of this annual mega religious fete, Sri Ramachandra decked up as Navaneeta Krishna charmed the devotees.

Temple officials and a large gathering of devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవనీత కృష్ణుడిగా అలరించిన ఒంటిమిట్ట రామయ్య

ఒంటిమిట్ట / తిరుపతి, 2026 మార్చి 30: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం స్వామివారు నవనీత కృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా సాగింది. మార్గమంతా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

పురాణాల ప్రకారం బాలకృష్ణుడు వెన్నదొంగగా ప్రసిద్ధి. యశోదమ్మ ఇంట్లోనే కాక రేపల్లెలోని ప్రతి ఇంటికీ వెళ్లి వెన్నను ఆరగించేవాడని కథలు చెబుతాయి. ఈ బాలకృష్ణుడి లీలలను స్మరింపజేస్తూ రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్‌ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్‌తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.