NAVARATRI KOLUVU IN SRIVARI TEMPLE _ న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో న‌వ‌రాత్రి కొలువు ప్ర‌త్యేకం

BOMMALA KOLUVU STANDS AS SPECIAL ATTRACTION

Tirumala, 15 October 2023: As part of Navaratri Brahmotsavams, every day, the traditional temple court(Koluvu) will be held at the Ranganayakula after the completion of evening Vahana Seva.

The objective is to give relief and relaxation to the processional deities after the hectic schedule of vahana seva 

On the other hand, following the Navaratri festival, the arrangement of an array of idols of deities in various rows is been a custom in Hindu families especially in Southern states. The Garden wing of TTD, under the supervision of its Deputy Director Sri Srinivasulu also organised an attractive display of idols at Ranganayakula Mandapam which included Dasavataram, Sri Maha Vishnu and Sri Lakshmi Devi.

The garden department also decorated the mandapam with apples, cut flowers and traditional flowers which allured the devotees to a great extent.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో న‌వ‌రాత్రి కొలువు ప్ర‌త్యేకం

తిరుమల, 2023 అక్టోబ‌రు 15: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో న‌వ‌రాత్రి కొలువు ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తారు. రాత్రి వాహ‌న‌సేవ‌ అనంత‌రం ఒక గంట పాటు ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కొలువు జ‌రుగుతుంది. శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని పెద్ద‌శేష వాహ‌నంపై ఆశీనుల‌ను చేసి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా స్వామి, అమ్మవార్లకు ధూపం, దీపం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం స‌మ‌ర్పించి శోడ‌షోప‌చారాలు చేస్తారు. ఇందులో వేదపండితులు దివ్య‌ప్ర‌బంధాన్ని ప‌ఠిస్తారు. చివ‌ర‌గా అర్చ‌కుల‌కు శ‌ఠారి, బ‌హుమానం స‌మ‌ర్పిస్తారు. వాహ‌న‌సేవ‌ల్లో అల‌సిపోయిన స్వామి, అమ్మ‌వార్ల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు ఈ కొలువు నిర్వ‌హిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

ఆక‌ట్టుకున్న బొమ్మ‌ల కొలువు

న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల మొద‌టిరోజు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో బొమ్మ‌ల కొలువు ఆక‌ట్టుకుంది. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో రంగ‌నాయ‌కుల మండ‌పాన్ని ఆపిల్స్‌, క‌ట్‌ఫ్ల‌వ‌ర్లు, సంప్ర‌దాయ పుష్పాల‌తో శోభాయ‌మానంగా అలంక‌రించారు. శ్రీ‌మ‌హావిష్ణువు, ల‌క్ష్మీదేవితోపాటు ద‌శావ‌తారాల బొమ్మ‌ల‌ను కొలువుతీర్చారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.