NAVARATRI UTSAVAMS COMMENCES AT TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

TIRUPATI, 07 OCTOBER 2021: The nine-day Navarathri Utsavams commenced in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Thursday in Ekantam.

 

Snapana Tirumanjanam was performed between 2.30pm and 4pm in Sri Krishna Mukha Mandapam. 

 

Later in the evening, Unjal Seva was also observed on between 7pm and 8pm.

 

TTD has cancelled all Arjitha Sevas in view of this Navahnika Utsavam.

 

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Seshagiri and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 అక్టోబ‌రు 07: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ఊంజల్‌సేవ నిర్వహించారు.

అక్టోబరు 15వ తేదీనాడు ఆల‌యంలో గజ వాహనంపై అమ్మ‌వారిని వేంచేపు చేసి ఆస్థానం చేప‌డ‌తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా అన్ని ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.