NAVI MUMBAI SITE VISITED _ న‌వీ ముంబ‌యిలో 10 ఎక‌రాల స్థ‌లం అధికారిక పత్రాల అంద‌జేత‌

TIRUMALA, 24 MAY 2022: A team of TTD officials led by Sri Mallikarjuna, the Special Officer of Estates Wing, visited the site allotted to TTD by Maha Government towards the construction of SV temple at Ulvi in Navi Mumbai.

Sri Kailash Shinde, IAS, the Joint Managing Director of City and Industrial Development Corporation of Maharashtra (CIDCO) handed over the papers and site map to the TTD Special Officer at Mumbai on Tuesday.

The ten acre site costing around 400crores is located in a prime area with its proximity to Old and New Mumbai Cities. On one side it is close to beach and on other side to the new airport which is under progress.

Mumbai Temple Superintendent Sri Giri Kiran and Surveyor Sri Harnath were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వీ ముంబ‌యిలో 10 ఎక‌రాల స్థ‌లం అధికారిక పత్రాల అంద‌జేత‌

తిరుమ‌ల‌, 2022 మే 24: మహారాష్ట్రలోని నవీ ముంబ‌యిలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన 10 ఎక‌రాల స్థ‌లానికి సంబంధించిన అధికారిక పత్రాలను మంగ‌ళ‌వారం టిటిడి ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మ‌ల్లికార్జున అందుకున్నారు. సిటి ఇండస్ట్రియల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ మహారాష్ట్ర అధికారి శ్రీ కైలాష్ షిండే ఈ ప‌త్రాల‌ను, స్థ‌లం ప్లాన్‌ను అంద‌జేశారు.

న‌వీ ముంబ‌యిలోని ఉల్వే ప్రాంతంలో ఉన్న ఈ 10 ఎక‌రాల స్థ‌లాన్ని టిటిడి ఎస్టేట్ విభాగం అధికారులు స‌ర్వే చేశారు. స‌ముద్ర తీరానికి, కొత్త‌గా రానున్న విమానాశ్ర‌యానికి స‌మీపంలో, అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఉన్న ఈ స్థ‌లం శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి అత్యంత అనువుగా ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ముంబయి శ్రీవారి ఆలయ సూప‌రింటెండెంట్ శ్రీ గిరి కిర‌ణ్‌, స‌ర్వేయ‌ర్ శ్రీ హ‌రినాథ్ పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.