NEW DELHI SRI VENKATESWARA SWAMY BRAHMOTSAVAMS BEGINS _ ధ్వజారోహణంతో  న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, May 01, 2026: The annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, New Delhi, commenced on Friday morning with Dhwajarohanam.

The flag hoisting was performed between 9 am and 10.30 am in Mithuna Lagnam, inviting all celestial beings to the festival. Special pooja was offered to the Garuda flag before hoisting it on the temple mast.

Pedda Sesha Vahana Seva will be held at 7.30 pm.

Local Advisory Committee Chairman Sri Sumanth Reddy, AEO Sri Balaraju, temple staff, priests, and devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

ధ్వజారోహణంతో  న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2026 మే 01: న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 7.30 గంటలకు స్వామివారు పెద్ద‌శేష‌వాహనంపై విహ‌రించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.

ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.

ఈ కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సుమంత్ రెడ్డి, ఆలయ ఏఈవో శ్రీ బాల‌రాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రంగనాయక్, శ్రీ ఉదయ్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.  

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.