NEW TTD TRUST BOARD CHAIRMAN SWORN IN _ టీటీడీ చైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం
TIRUMALA, 06 NOVEMBER 2024: Sri BR Naidu took oath as the Chairman of the TTD Trust Board in Tirumala temple on Wednesday
TTD EO Sri J Syamala Rao administered him oath in front of Sri Venkateswara Swamy at Bangaru Vakili inside the Tirumala temple.
Later he had darshan of the presiding deity along with him family members.
At Ranganayakula Mandapam he was offered Vedaseervachanam by the Vedic Pundits followed by the distribution of Theertha Prasadams, lamination photo of Lord, TTD calendars and diaries.
Earlier, following the temple tradition, Sri BR Naidu had darshan of Sri Bhu Varaha Swamy and Swamy Pushkarini.
Later he reached Mahadwaram of the temple through Vaikuntham Queue Complex. He was welcomed by TTD officials at the entrance of the temple.
Thereafter, TTD Additional EO Sri Ch Venkaiah Chowdary administered oath with the Endowments Secretary Sri Satyanarayana, Smt. Vemireddy Prasanthi Reddy, Sri Janga Krishnamurthy, Sri Mallela Rajasekhar Goud, Sri Jastipurna Sambasiva Rao, Sri M.S. Raju, Sri Narsi Reddy, Sri Boogunur Mahender Reddy, Smt. Anugolu Ranga Sri, Sri Anand Sai, Smt. Janaki Devi Tammisetti, Sri R.N. Darshan, Sri M. Shantaram, Sri S. Naresh Kumar and Dr. Adit Desai as members of the TTD Trust Board.
After darshan, they had Vedic blessings and Theertha Prasadams at Ranganayakula Mandapam, while the TTD officials presented them with a picture of Srivaru, diaries and calendars, Theertha Prasadams.
TTD JEO Sri Veerabrahmam, CVSO Sri Sreedhar, Deputy EOs Sri Lokanatham, Sri Bhaskar, Smt Prasanthi and others participated in the program.
Meanwhile, Sri P. Ramamurthy will take oath at 2 pm as TTD Trust board member.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ చైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం
తిరుమల, 2024 నవంబరు 06: తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ శ్రీ బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భూ వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి విచ్చేశారు.
ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు శ్రీ బి.ఆర్.నాయుడుకు స్వాగతం పలికారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు శ్రీ బి.ఆర్.నాయుడు తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకోగా రంగ నాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం, టీటీడీ డైరీలు, క్యాలెండర్ లు అందించారు.
అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులుగా దేవాదాయశాఖ సెక్రటరీ శ్రీ సత్య నారాయణ, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీ మల్లెల రాజశేఖర్ గౌడ్, శ్రీ జాస్తి పూర్ణ సాంబశివరావు, శ్రీ ఎం.ఎస్.రాజు, శ్రీ నర్సిరెడ్డి, శ్రీ బూంగునూరు మహేందర్ రెడ్డి, శ్రీమతి అనుగోలు రంగ శ్రీ, శ్రీ ఆనంద్ సాయి, శ్రీమతి జానకి దేవి తమ్మిశెట్టి, శ్రీ ఆర్.ఎన్.దర్శన్, శ్రీ ఎం.శాంతారామ్, శ్రీ ఎస్.నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయ్ లు ప్రమాణం స్వీకారం చేశారు. వీరిచే టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందించగా అధికారులు శ్రీవారి చిత్ర పటం, డైరీలు, క్యాలెండర్లు అందజేశారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ పి.రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీమతి ప్రశాంతి, శ్రీ భాస్కర్ లు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.