NEWS ON THE DEATH OF 100 COWS IN TTD IS A FAKE _ టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం

టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం

తిరుపతి, 2025, ఏప్రిల్ 11: టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు.

మృతి చెందిన గోవులు పోటోలు టిటిడి గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు పోటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టిటిడి ఖండిస్తోంది.

ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టిటిడి కోరుతోంది.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.