NO MISBEHAVING BY ANYONE AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో మాపట్ల ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదు

DON’T TROLL US FOR POLITICS

HYDERABAD DEVOTEES RELEASES VIDEO OF INCIDENT

Tirumala, 08 December 2023: Sri Ravikumar Devotee couple from Hyderabad clarified with a video that no TTD employee misbehaved with him and his wife during Srivari Darshan at Srivari temple on December 6.

He reiterated that after the Darshan in SRINIVANI ticket, the temple staff asked us to leave but did not push or manhandled as trolled by the social media and in media and also posted a video on Friday.

The fact about the incident in the devotee’s words is that they had come for Srivari Darshan on December 6 by procuring SRIVANI tickets and the temple staff had loudly asked them to leave when they took a little more time to depart.

Hurt by their behaviour he said, we spoke to media later with the intention that it would reach the senior officials who could take action against the rudely behaved TTD staff conduct.

However he said, he was hurt immensely when some social media and media has made a mountain of mole and been trolling the incident with political motives.

They said we had come for Darshan four times in SRIVANI  and had experienced a good Darshan every time.  He said it is unfair and pained to see that mud-slinging on TTD with political motives.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో మాపట్ల ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదు

– రాజకీయాల కోసం మమ్మల్ని ట్రోల్ చేయొద్దు

– వీడియో విడుదల చేసిన హైదరాబాద్ కు చెందిన భక్తుడు రవికుమార్

తిరుమల 8 డిసెంబరు 2023: శ్రీవాణి టికెట్ కొని శ్రీవాణి దర్శనం చేసుకున్న తమకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని హైదరాబాద్ కు చెందిన భక్తుడు శ్రీ రవికుమార్ దంపతులు స్పష్టం చేశారు. దర్శనం అనంతరం స్వామి వారిని చూస్తూ వెనక్కు నడుచుకుంటూ తన్మయత్వంలో అక్కడే ఆగిపోయిన సమయంలో అక్కడి సిబ్బంది వేగంగా వెళ్లాలని తమకు గట్టిగా చెప్పారేకానీ అసభ్యంగా ప్రవర్తించలేదని వారు చెప్పారు. ఈ విషయాన్ని మీడియా, సోషల్ మీడియా వక్రీకరించి టీటీడీ మీద బురద చల్లేలా ప్రచారం చేయడం తమకు బాధ కలిగించిందని వారు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఇందులో ఏముందంటే మేము శ్రీవాణి టికెట్ మీద దర్శనానికి వచ్చాము తిరుమలలో వసతి దర్శనం అన్నీ బాగా అయ్యాయి దర్శనం తరువాత స్వామిని చూస్తూ వెనక్కు వ
స్తూ తన్మయత్వంతో అక్కడే నిలబడిపోయాము. ఆ సమయంలో అక్కడి సిబ్బంది మాతో గట్టిగా మాట్లాడారు. దాంతో మేం కొంత బాధపడి వాస్తవాలు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళితే సమస్యలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మీడియాతో మాట్లాడాము. దీన్ని కొందరు లేనివి ఉన్నట్లుగా వారి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ట్రోల్ చేయడం బాధాకరం. ఇప్పటికి మేము నాలుగు సార్లు శ్రీవాణి దర్శనానికి వచ్చాము. ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మమ్మల్ని అడ్డుపెట్టుకుని టీటీడీ మీద బురద చల్లడం మాకు చాలా బాధ కలిగించింది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది