NO POURNAMI GARUDA SEVA ON DEC 04 _ డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
KARTHIKA DEEPOTSAVAM IN TIRUMALA TEMPLE
TIRUMALA, 03 DECEMBER 2025: The monthly Pournami Garuda Seva stands cancelled on December 04 following Karthika Deepotsavam in Tirumala.
The sacred ghee lit lamps will lighten up the entire temple premises on Thursday evening on the auspicious occasion of Karthika Pournami.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
కార్తీక పౌర్ణమి గరుడ సేవ రద్దు
తిరుమల, 2025 డిసెంబర్ 03: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
