NOVEMBER SPECIAL FESTIVALS AT TTD TEMPLES _ నవంబర్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేషఉత్సవాలు
Tirumala, 01 November 2025: The following are the various events lined up in various TTD temples in the month of November.
Sri Kodanda Rama Swamy temple:
On all Saturdays in November (1, 8, 15, 22, 29): Abhishekam at 6 AM and procession at 5.30 PM.
Nov 05 (pournami) : Ashtothara Kalashabhishekam at 9.30 AM
Nov 10 (Punarvasu): Sri Sitarama Kalyanam at 11 AM.
Nov 20 (Amavasya): Sarasra Kalashabhishekam at 9 AM; Hanumantha Vahanam at 7 PM.
Sri Govindaraja Swamy Temple
Nov 02: Kaisika Dwadasi Asthanam
Nov 05: Pournami Garuda Seva
Nov 14, 21, 28 (Fridays): Andal Ammavaru procession at 6 PM
Nov 07 (Rohini): Sri Parthasaradhi Swamy procession at 6 PM
Nov 15 (Uttara): Sri Govindaraja Swamy procession
Nov 26 (Shravana): Sri Kalyana Venkateswara Swamy procession
Nov 25 – Dec 04: Sri Tirumangai Alwar Utsavam
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబర్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– నవంబర్ 01, 08, 15, 22, 29 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
• నవంబర్ 05వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.
• నవంబర్ 10న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 5.30 గం.లకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.
• నవంబర్ 20న ఉదయం 09.00 గం.లకు అమావాస్య, సరస్ర కలశాభిషేకం, రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
నవంబర్ నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….
• నవంబర్ 02న కైశిక ద్వాదశి ఆస్థానం
• నవంబర్ 05న పౌర్ణమి గరుడసేవ
– నవంబర్ 14, 21, 28 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
– నవంబర్ 07న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
– నవంబర్ 15న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.
• నవంబర్ 26న శ్రావణం నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు మాడ వీధులలో భక్తులను కటాక్షిస్తారు.
• నవంబర్ 25 నుండి డిసెంబర్ 04 వరకు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం.
