NRISIMHA JAYANTI OBSERVED IN SRI TT _ శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి
TIRUMALA, 11 MAY 2025: On the auspicious occasion of Nrisimha Jayanti, a special Abhishekam was performed to Sri Yoga Narasimha Swamy, a sub temple located in the Tirumala temple on Sunday evening.
Every year on the auspicious Vaisakha Chaturdhi Tithi this ritual is observed with religious fervour.
Temple officials, archakas participated.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి
తిరుమల, 2025 మే 11: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం నృసింహ జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు.
శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.