ODISHA CM INVITED _ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి – ఒడిశా సిఎం శ్రీ నవీన్ పట్నాయక్ కు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం
TIRUPATI, 14 MAY 2022: TTD Chairman Sri YV Subba Reddy on Saturday invited the Honourable CM of Odisha Sri Naveen Patnaik for the Maha Samprokshanam of Sri Venkateswara temple at Bhuvaneshwar scheduled from May 21 to 26.
He formally met the CM of Odisha at his residence on Saturday evening and explained him about the various rituals including Vigraha Pratista, Avahana Prana Pratistha, Maha Samprokshanam and others.
TTD JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, VGO Sri Manohar, LAC Chief Sri Dushyant Kumar and others were also present.
The Chairman also inspected the ongoing arrangements in Bhuvaneshwar. He also interacted with Srivari sevaks.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి
– ఒడిశా సిఎం శ్రీ నవీన్ పట్నాయక్ కు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం
తిరుపతి 14 మే 2022: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ ను ఆహ్వానించారు. శనివారం సాయంత్రం చైర్మన్ ముఖ్యమంత్రిని ఆయన అధికారిక నివాసంలో కలిసి శ్రీవారి ప్రసాదాలు,ఆహ్వాన పత్రిక అందజేసి శాలువతో సన్మానించారు.
మే 21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని శ్రీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కి తెలియజేశారు. 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. కార్యక్రమానికి హాజరవుతానని సిఎం తెలియజేశారు.
అంతకుముందు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి భువనేశ్వర్ లో ఆలయ నిర్మాణ పనులు, మహాసంప్రోక్షణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణమండపంలోని గదులకు ఎసి సదుపాయం కల్పించాలని భక్తులు చైర్మన్ కు కోరారు. వెంటనే ఈ ఏర్పాటు చేయాలని చైర్మన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవకులతో అక్కడి వసతులు, ఇతర అంశాలపై మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు.
జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, విజిఓ శ్రీ మనోహర్, భువనేశ్వర్ స్థానిక సలహామండలి చైర్మన్ శ్రీ దుశ్యంత్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.