OFFLINE DONATIONS ARE INVITED TOWARDS THE CONSTRUCTION OF CHILDREN’S HRIDAYALAYA _ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం ఆఫ్లైన్లో విరాళాలు ఆహ్వానం
చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం ఆఫ్లైన్లో విరాళాలు ఆహ్వానం
తిరుమల, 2022 జూన్ 13: తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణం కోసం టీటీడీ దాతల నుండి నేరుగా విరాళాలు (ఆఫ్లైన్లో) ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆన్లైన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుండి స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.
భక్తుల విజ్ఞప్తి మేరకు ఆఫ్లైన్లో కూడా విరాళాలు స్వీకరించాలని టీటీడీ నిర్ణయించింది. కావున కోటి రూపాయలు విరాళం ఇవ్వదల్చిన దాతలు ఈవో, టీటీడీ పేరున డిడి, చెక్కు అందించవచ్చు. ఒక కోటి రూపాయలు విరాళంగా అందించిన దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్లు కేటాయించబడుతుంది. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది. ఇతర వివరాలకు తిరుమలలోని ఆర్జితం కార్యాలయాన్ని 0877-2263589 నంబరులో సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.