ONE CRORE DONATED _ టీటీడీ కి రూ కోటి విరాళం

TIRUMALA, 25 MARCH 2022: Dubai based Chartered Accountant Sri M Hanumanta Kumar has donated Rs. One Crore to TTD.

He has handed over the same to TTD Chairman Sri YV Subba Reddy in his camp office at Tirumala on Friday and asked to utilize the amount to any of the Trusts as per the wish of management.

On the other hand, Secunderabad based Padmavathi Solutions Chief Sri Sridhar has donated Rs.10,01,116 to SV Gosamrakshana Trust of TTD and handed over the DD to TTD Chairman.

He also lauded the various Go related activities taken up by TTD under the stewardship of Sri YV Subba Reddy. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ కి రూ కోటి విరాళం

– చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి డిడి అందజేసిన దుబాయ్ భక్తుడు

తిరుమల 25 మార్చి 2022: దుబాయ్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ ఎం. హనుమంత కుమార్ శుక్రవారం టీటీడీ కి రూ కోటి విరాళంగా అందించారు. తిరుమల లోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు డిడి అందజేశారు. టీటీడీ అభీష్టం మేరకు ఈ సొమ్ము ఏ ట్రస్ట్ కైనా జమచేసుకోవాలని దాత కోరారు.

గో సంరక్షణ ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ కు సికింద్రాబాద్ కు చెందిన శ్రీ పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీ శ్రీధర్ శుక్రవారం రూ.10, 01, 116 ( పదిలక్షల వెయ్యి నూట పదహారు) విరాళంగా అందించారు. తిరుమల లోని టీటీడీ చైర్మన్ క్యాపు కార్యాలయంలో ఈ మేరకు డిడిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.

చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో గో సంరక్షణకు టీటీడీ చేపట్టిన చర్యలకు సంతోషించి ఈ విరాళం అందించినట్లు దాత తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది