ONE CRORE DONATION TO BIRRD TRUST _ బర్డ్ ట్రస్టుకు రూ.1.10 కోట్లు విరాళం
TIRUMALA, 18 SEPTEMBER 2021: Chennai based devotee Sri Balu Ramajayan has donated Rs.One Crore to TTD BIRRD Trust and handed over the DD for the same amount to TTD Additional EO Sri AV Dharma Reddy at his Bungalow in Tirumala on Saturday.
Speaking on the occasion, the Additional EO of TTD said the donor, earlier also has donated to various trusts. A couple of months ago, he has donated Rs. One Crore to SVBC Trust. And also donated for the medicines during the Covid Second Wave”, he added.
“Upon our request, he has now donated Rs.1.10crore to BIRRD Trust to purchase 200 numbers of state of art beds for the hospital needs. These beds will be very much useful for the patients”, he maintained.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
బర్డ్ ట్రస్టుకు రూ.1.10 కోట్లు విరాళం
తిరుమల, 2021 సెప్టెంబరు 18: టిటిడి బర్డ్ ట్రస్టుకు శనివారం రూ.1.10 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన శ్రీ బాలు రామజయన్ ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని అదనపు ఈవో బంగళాలో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి భక్తుడైన శ్రీ బాలు రామజయన్ ఇదివరకే టిటిడిలోని పలు ట్రస్టులకు విరాళాలు అందించారని, రెండు నెలల క్రితం ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయలు అందజేశారని తెలిపారు. కరోనా రెండో విడతలో బర్డ్ ఆసుపత్రికి అవసరమైన మందులను కూడా అందించారని చెప్పారు. ప్రస్తుతం బర్డ్ ట్రస్టుకు రూ.1.10 కోట్లు విరాళంగా అందించారని, ఈ మొత్తంతో 200 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యువల్ బెడ్ ఫైవ్ ఫంక్షన్ డీలక్స్ మంచాలు కొనుగోలు చేస్తామని వివరించారు. ఒక నెలలో ఈ మంచాలు కొనుగోలు చేసి బర్డ్ ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉంచుతామని, ఇవి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు. శ్రీ బాలు రామజయన్ కుటుంబానికి శ్రీవారు సంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.