ONE LAKH DONATION TO ANNADANAM TRUST OF SRI KRT VONTIMITTA _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయ అన్నదానం ట్రస్ట్ కు రూ. లక్ష విరాళం

Vontimitta, 05:March 2026: A donation of Rs.1,01,116 was received towards the Annadanam Trust of Sri Kodandarama Swamy Temple, Ontimitta on Thursday.

On this occasion, a local businessman from B. Kothapeta mandal headquarters of Annamayya district, Sri S. Venkata Ratnamayya and Smt. S. Subhadramma, handed over the donation DD to TTD JEO Sri V. Veerabrahmam at the TTD meeting hall in Vontimitta.

Later, TTD JEO Sri V. Veerabrahmam felicitated the donor with a shawl and appreciated their generosity.

Annadanam Special Officer Sri G.L.N. Sastry, Deputy EOs Sri Rajendra Kumar, Sri Siva Prasad, Sri Selvam, and others were present on the occasion.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయ అన్నదానం ట్రస్ట్ కు రూ. లక్ష విరాళం 

ఒంటిమిట్ట, 2026, మార్చి 05: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం అన్నదానం ట్రస్ట్ కు రూ.1,01,116 విరాళం గురువారం అందింది. 

ఈ మేరకు అన్నమయ్య జిల్లా బి.కొత్తపేట మండల కేంద్రానికి చెందిన స్థానిక వ్యాపారి శ్రీ ఎస్. వెంకట రత్నమయ్య, శ్రీ ఎస్. సుభద్రమ్మ దంపతులు విరాళం డిడిని టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంకు ఒంటిమిట్టలోని టిటిడి సమావేశ మందిరంలో అందించారు.

ఈ సందర్భంగా దాతను టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం శాలువాతో సన్మానించి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో అన్నదానం ప్రత్యేక అధికారి శ్రీ జి ఎల్ ఎన్ శాస్త్రి, డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర కుమార్, శ్రీ శివప్రసాద్, శ్రీ సెల్వం తదితరులు పాల్గొన్నారు. 

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.