ONE MORE WINDMILL FOR TIRUMALA _ టీటీడీకి రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం
TIRUMALA, 01 DECEMBER 2023: The Mumbai-based Vish Wind Infrastructure Limited has donated 800 kilowatts of electricity-generating turbines worth Rs.5 crore to TTD.
TTD EO Sri AV Dharma Reddy visited the GNC area along with the Engineering officials of TTD to inspect the ongoing installation works. The TTD Chairman Sri. Bhumana Karunakara Reddy will commence the power generation after getting approval from APSEB soon.
This wind turbine will generate 18 lakh units of electricity per year and will also save Rs.one crore per year for TTD.
About 15 years ago, this company has already installed two wind turbines that generates 1.03 megawatts of electricity for the needs of TTD. This company is also taking care of its management and maintenance. They will also look after the maintenance of the 0.8-megawatt electricity-generating windmill that is currently being set up.
TTD JEO for Health and Education Smt Sada Bhargavi, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, DE Electrical(Tirumala) Sri Ravishankar Reddy, EEs Sri Srinivas, Sri Surendranath Reddy, company representatives and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం
– ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2023 డిసెంబరు 01: ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్‌ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను విరాళంగా అందించారు.
తిరుమల జిఎన్‌సి ప్రాంతంలో గాలిమర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఎపిఎస్ఇబి నుండి అనుమతులు వచ్చిన తరువాత టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
ఈ విద్యుత్ గాలిమర ద్వారా సంవత్సరానికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన ప్రతి ఏడాది టీటీడీకి రూ.కోటి ఆదా అవుతుంది.
కాగా ఇప్పటికే టీటీడీ అవసరాలకు 15 సంవత్సరాల క్రితమే ఈ కంపెనీ వారు 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు గాలి మర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ వారే చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 0.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమర నిర్వహణను కూడా వీరే చూడనున్నారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఈ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్ రెడ్డి, ఇఇలు శ్రీ సురేంద్ర నాథ్ రెడ్డి, శ్రీ శ్రీనివాసులు, కంపెనీ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.