ONLINE APPLICATIONS INVITED FOR TTD JUNIOR COLLEGES ADMISSIONS_ టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, May 07, 2026: TTD has invited online applications for admissions into Sri Padmavathi Women’s Junior College and Sri Venkateswara Junior College for the academic year 2026-27.

Eligible students can apply online through https.//admission.tirumala.org till June 3.

TTD said student manuals and college prospectus are available in both Telugu and English for the convenience of students. Admissions will be allotted online based on merit and reservation rules.

Students are advised to carefully read the guidelines and upload correct details before the deadline. Help desk numbers are also available on the website for clarification of doubts. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి,2026 07: టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలశ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో  2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌డ‌మైన‌దిజూన్ 3 తేదీ వరకు ఆన్ లైన్ లో https://admission.tirumala.org  వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుఆన్ లైన్ దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉందివిద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగుఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా ?

విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే ” Student Manual in English” or “Student Manual in Telugu” రెండు బాక్స్ లు కనిపిస్తాయివిద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ లపైన క్లిక్ చేశాక,  అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలిఅనంతరం ఇంటర్మీడియట్ కోర్సుకు Junior Collegeను ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలిక్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు లేదా తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయివాటిలో తమకు కావాల్సిన బాక్స్ లపై క్లిక్ చేయగానే టిటిడి ఆధ్వర్యంలోని రెండు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉన్న వివిధ గ్రూప్ లలోని సీట్లువాటిలో ప్రవేశానికి కావాలసిన అర్హతలుసీట్ల భర్తీ విధానంమార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి 

విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభరిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటును తాత్కాలికంగా ఆన్ లైన్ లో  కేటాయించివిద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ పంపుతారుసీటు పొందిన సదరు విద్యార్థి ధృవీకరణ పత్రాలను వారి సమక్షంలోనే సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు.  అయితే విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నాఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్నసీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు  రద్దు అవుతుంది.  విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందిగడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదుఅందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌నుక‌ళాశాల‌ ప్రాస్పెక్ట‌స్‌ను పూర్తిగా చదివి పక్కన పెట్టుకుని  ఆన్ లైన్ లో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టిటిడి కోరుతోంది.

విద్యార్థులు దరఖాస్తు నింపు సమయంలో సాంకేతిక సందేహాలుకోర్సులలోని వివిధ గ్రూప్ లువసతి గృహాలు,  నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా  నివృత్తి చేసుకోవచ్చు.  admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ఫ్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుందిఅక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు ఉంటాయివీటి ద్వారా ఆయా అంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు 

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.