ONLINE QUOTA RELEASE FOR AUGUST ON MAY 19 _ మే 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల ఆగ‌స్టు నెల‌ కోటా విడుదల

Tirumala, 15 May 2025: TTD will release the online quota of Srivari Arjitha Seva tickets and accommodation for the month of August on May 19 at 10AM through its official website.

Devotees can register online for the electronic dip for these seva tickets until 10 AM on May 21.

Those selected in the lucky dip must complete payment by 12 noon between May 21 and 23 to confirm their tickets.

Release of Arjitha Seva Tickets

Tickets for Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Sahasra Deepalankara Seva, and Srivari Salakatla Pavitrotsavam will be on May 22 at 10AM.

The Virtual Sevas and their corresponding Darshan slots for the month of August will be released on May 22 at 3 PM.

The Angapradakshinam tokens will be released on May 23 at 10 AM.

The Srivani Trust tickets for will be released on May 23 at 11 AM while the Senior Citizens & Differently-Abled Darshan Quota at 3 PM.

The Special Entry Darshan tickets (Rs.300) will be released on May 24 at 10 AM while the accommodation quota for rooms in Tirumala and Tirupati at 3PM on the same day.

SRIVARI SEVA VOLUNTARY SERVICE

The July month quota for Srivari Seva(both Tirumala and Tirupati), Parakamani Seva, Navaneetha Seva, and Group Leaders (Senior Sevaks) Seva will be released on May 29 at 11 AM.

Devotees are requested to book their Arjitha Sevas and Darshan tickets through the official TTD website: https://ttdevasthanams.ap.gov.in only.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల ఆగ‌స్టు నెల‌ కోటా విడుదల

తిరుమల, 2025, మే 15: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు మే 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్స‌వాల‌ టికెట్లను మే 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

29న శ్రీవారి సేవా కోటా విడుదల

శ్రీవారి సేవ(తిరుమల మరియు తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.