ONLINE SED QUOTA RELEASE ON MARCH 21 _ మార్చి 21న ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల కోటా విడుద‌ల

Tirumala, 18 Mar. 22: TTD plans to release the online quota of Special Entry Darshan tickets of ₹300/- for the months of April, May and June months continuously for three days from March 21.

In a statement, TTD said the April online quota will be released on March 21, the May quota on March 22 and June quota on March 23.

The TTD said 30,000 SED tickets will be allotted for Srivari Darshan from Monday to Wednesday and 25,000 SED tickets for Srivari Darshan from Thursday to Sunday.

Similarly, daily 30,000 Slotted Sarva Darshan (SSD) tickets will be released offline at the Tirupati counters at Bhudevi complex, Srinivasam complex and at Sri Govindarajaswamy Choultries.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 21న ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల కోటా విడుద‌ల

తిరుమల, 2022 మార్చి 18: శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల రూ.300/-  ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను మార్చి 21వ తేదీ నుండి వరుసగా మూడు రోజుల పాటు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఏప్రిల్ నెల కోటాను మార్చి 21న, మే నెల కోటాను మార్చి 22న, జూన్ నెల కోటాను మార్చి 23న విడుదల చేస్తారు.

రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు సోమవారం నుండి బుధవారం వరకు రోజుకు 30 వేల టిక్కెట్లు, గురువారం నుండి ఆదివారం వరకు రోజుకు 25 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

అదేవిధంగా, స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లను రోజుకు 30 వేల టోకెన్లు చొప్పున ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన‌ కౌంట‌ర్ల‌లో భ‌క్తుల‌కు కేటాయిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.