ONLINE TICKETS OF SRINIVASA DIVYANUGRAHA HOMAM _ ఆఫ్‌లైన్‌లో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్లు
Tirumala, 21 November 2023: TTD has decided to issue tickets for participating in the Srinivasa Divyanugraha Homam being organised all throught the year at the Sapta Go Pradakshina Mandiram in Alipiri starting from November 23 onwards.
TTD intends to issue 50 offline and 50 online tickets for participating in the auspicious Homa being held for the benefit of humanity as a part of its one of the chief missions of propagation of
Sanatana Hindu Dharma.
The online tickets were issued on November 16 and offline tickets are available from November 20 till 22 afternoon at the Sapta Go Pradakshina Mandiram.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆఫ్‌లైన్‌లో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్లు
తిరుమల, 2023 నవంబరు 21: హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఇందుకోసం టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారు.
రోజుకు ఆన్‌లైన్‌లో 50 టికెట్లు, ఆఫ్‌లైన్‌లో 50 టికెట్లు కేటాయిస్తారు. ఆన్‌లైన్ టికెట్లను నవంబరు 16న టీటీడీ విడుదల చేసింది. మొదటిరోజైన నవంబరు 23వ తేదీ హోమం ఆఫ్‌లైన్ టికెట్లను నవంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం వరకు సప్తగోప్రదక్షిణ మందిరం ప్రాంగణంలో జారీ చేస్తున్నారు. భక్తులు నేరుగా వచ్చి ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. నవంబరు 24వ తేదీ నుండి ఏరోజుకారోజు టికెట్లు మంజూరు చేస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.