OVER 1.7L DEVOTEES GET SRIVARI DARSHAN ON SAT AND SUN DAYS _ రెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం
Tirumala, 04 November 2024: Special service line and platform for facilitation of Anna Prasadam and drinking water.
In a major drive to facilitate Srivari Darshan to common devotees during weekends, TTD is creating a unique space for them on Saturdays and Sundays.
As part of these efforts of TTD darshan of Srivaru was provided to a record number of 1.72,565 devotees on last Saturday and Sunday.
TTD rolled out Special measures to ensure that 88,076 devotees had Darshan of Sri Venkateswara Swamy on Saturday and
84,489 on Sunday during last week.
One of the new initiatives is the introduction of a service line at Narayangiri Sheds, which reduced the waiting time for devotees in queue lines.
The Deputy EOs Sri. Harindranath, Sri. Lokanatham, Sri. Rajendra continuously monitored the Vaikuntham Queue Complex, Narayangiri Sheds and outside queue lines.
They ensured a regular supply of Breakfast, milk and drinking water to the waiting devotees in the queue lines utilising the services of Srivari Sevaks.
All out efforts were made to provide hassle-free and smooth Srivari Darshan to the devotees in queue lines.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం
శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ
తిరుమల, 2024 నవంబరు 04: శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు వారాంతాల్లో టీటీడీ పెద్ద పీఠ వేస్తోంది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. శనివారం 88,076 మంది, ఆదివారం 84,489
మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది.
నారాయణగిరి షెడ్ల వద్ద ఇటీవలే ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ తో భక్తులు క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గింది.
డిప్యూటీ ఈవో లు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లోకానాథం, శ్రీ రాజేంద్ర లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఔటర్ క్యూలైన్లు, నారాయణగిరి షెడ్ల ను నిరంతరం పర్యవేక్షిస్తూ టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం, పాలు, తాగు నీటిని 24 గంటలు పంపిణీ చేశారు. భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.