OVER 500 DONORS CONTRIBUTED FOR SRIVANI IN 10 DAYS _ శ్రీవాణి ట్రస్టుకు 10 రోజుల్లో 500 మందికి పైగా దాతల విరాళం
OVER 500 DONORS CONTRIBUTED FOR SRIVANI IN 10 DAYS
Tirumala, 31 Oct. 19: The prestigious Trust launched by TTD recently, the Sri Venkateswara Alaya Nirmana (SRIVANI) Trust has been gaining overwhelming response from pilgrims.
In the last ten days of it launch, the Trust collected over half a crore in the form of donations. So far 533 donors have contributed for the SRIVANI Trust (from October 21 till October 30. Every day there was a considerable increase in the number of donors.
The concept behind the launch of this trust is to promote Hindu Sanatana Dharma in the remote villages and avoid religious conversions. Apart from this, the construction of Sri Venkateswara Temples will also be taken up along with Archakatva training etc.in the hamlets.
The contributions made to this Trust will be between Rs.10,000 to Rs.99,999. The donor is entitled for Beginning Break darshan privilege at one ticket for donation of every Rs.10,000/- made with a ceiling of Nine (9) tickets. To redeem privileges of Beginning Break darshan under protocol, the donor should pay Rs.500/- per ticket. TTD is also contemplating to link the darshan ticket with accommodation when once the on-line application of SRIVANI Trust comes into force in November.
(The date wise data is attached herewith)
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవాణి ట్రస్టుకు 10 రోజుల్లో 500 మందికి పైగా దాతల విరాళం
తిరుమల, 2019 అక్టోబరు 31 ; శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం టిటిడి ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్రస్టుకు దాతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. అక్టోబరు 21 నుండి 30వ తేదీ వరకు పది రోజుల్లో 533 మంది దాతలు అరకోటి రూపాయలకుపైగా విరాళాలు అందించారు. రోజురోజుకూ దాతల సంఖ్య పెరుగుతుండడం హర్షణీయం.
సనాతన ధర్మప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించడం, మతమార్పిడులను అరికట్టడం, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణ తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం టిటిడి ఈ ట్రస్టును ప్రారంభించింది.
శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళమిచ్చే దాతలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ ప్రివిలేజ్‌గా అందిస్తారు. రూ.500/- చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శ్రీవాణి ట్రస్టుకు దాతలు ఒక రూపాయి నుండి ఎంతమొత్తమైనా విరాళంగా అందించవచ్చు. రూ.10 వేల నుండి టిటిడి కల్పించే ప్రయోజనాలు వర్తిస్తాయి. రూ.10 వేలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ చొప్పున 99 వేల వరకు 9 టికెట్లను దాతలు పొందే అవకాశముంది. ఒక లక్ష పైన విరాళాందించే దాతలకు టిటిడి ఇదివరకే పలు ట్రస్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న తరహాలోనే ప్రయోజనాలను వర్తింపచేస్తుంది. శ్రీవాణి ట్రస్టు ఆన్‌లైన్ అప్లికేషన్ నవంబరులో అందుబాటులోకి రానుంది. ఆ తరువాత దాతలు బ్రేక్ దర్శన టికెట్‌తో పాటు గదులు పొందే అవకాశం కూడా కల్పిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.