PADMAVATHI RIDES SURYA PRABHA VAHANAM AS VEDANARAYANA _ సూర్యప్రభ వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సిరుల తల్లి
Tirupati, 16 November 2023: On the seventh day morning of the ongoing karthika brahmotsavams in Tiruchanoor temple, Sri Padmavati Devi as Sri Vedanarayana blessed devotees on Surya Prabha vahanam on Thursday morning.
Later in afternoon, Snapana Tirumanjanam will be performed to utsava idols.
Tirumala Pontiffs, TTD Chairman Sri Bhumana Karunakara Reddy, Chandragiri Legislator Sri Bhaskar Reddy, EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindaraja were also present
సూర్యప్రభ వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సిరుల తల్లి
తిరుపతి, 2023 నవంబరు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన గురువారం ఉదయం శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
మధ్యాహ్నం 12:30 నుండి 2 -30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవాలకు ఉష్ణపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేయనున్నారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి , చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో శ్రీ వీర బ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విజిఓ
శ్రీ బాలిరెడ్డి సూపరిండెంట్ శ్రీమతి శ్రీ వాణి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ గణేష్, శ్రీ సుభాష్ పాల్గొన్నారు.
పంచమీ తీర్థానికి పటిష్ట ఏర్పాట్లు : చైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 18 వ తేదీ నిర్వహించనున్న పంచమి తీర్థానికి టీటీడీ అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసిందని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. వాహన సేవలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు . పంచమి తీర్థానికి వచ్చే భక్తులందరికీ అల్పాహారం, తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు .ముందు రోజు రాత్రికే వచ్చే భక్తులకు వేచి ఉండేందుకు మూడు వసతి కేంద్రాలు చేశామని, ఇందులో 25 వేల మంది భక్తులు ఉండవచ్చని చెప్పారు. వీరికి అవసరమైన అన్నప్రసాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ వివరించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పనకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులకు అమ్మవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. పంచమి తీర్థంకు తమిళనాడు తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుండి లక్షల సంఖ్య లో తరలి వచ్చే భక్తుల కోసం అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ వివరించారు .
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.