PADMAVATI TAKES RIDE ON HANUMANTA _ హనుమంత వాహనంపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు
TIRUPATI /CHENNAI:As a part of the ongoing annual brahmotsavams at Sri Padmavati Ammavaru temple at Chennai, the processional deity took out a celestial ride on Hanumanta Vahanam and blessed Her devotees.
Temple AEO Sri Dhanunjayulu and other staff, devotees participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
హనుమంత వాహనంపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు
తిరుపతి, 2026 ఫిబ్రవరి 10: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 09 గం.లకు కల్పవృక్ష వాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారి విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 07 గం.లకు హనుమంత వాహనంపై భక్తులను ఆశీర్వదించారు.
భజనలు, కోలాటాల నడుమ పుర వీధుల్లో శ్రీ పద్మావతీ అమ్మవారి వాహన సేవలను నిర్వహిస్తున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజ వాహనం సేవలో శ్రీ పద్మావతీ అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధనుంజయులు, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత , ఆలయ అర్చకులు ఇతర అదికారులు పాల్గొన్నారు.




