PALIMARU MUTT SEER VISITS SRIVARI TEMPLE IN PRAYAG RAJ _ ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన ఉడిపి పలిమారు మఠాధిపతి

Tirumala, 15 January 2025: Sri Sri Vidyadheesa Theertha Swamiji, the Pontiff of Palimaru Mutt in Udupi, visited the model temple of Srivaru set up in the Maha Kumbhamela at Prayagraj on Wednesday.

HDPP Secretary Sri Sriram Raghunath, Estate Officer Sri Guna Bhushan Reddy and priests welcomed him and explained the features of the model temple.  

Later he participated in the Unjal Seva of Swami.

On this occasion, in his Anugraha Bhashanam he said,  Sri Venkateswara Swamy came to Tirupati from Vaikuntam and now paved a visit to Prayagraj, the holy place where the Maha Kumbha Mela is being held to bless the devotees of North.  

The devotees should visit the temple and beget the divine blessings, he observed

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రయాగ్ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన ఉడిపి పలిమారు మఠాధిపతి

తిరుమల, 2025 జనవరి 15: ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని బుధవారం ఉడిపిలోని పలిమారు మఠాధిపతి శ్రీశ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆయనకు హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, అర్చకులు స్వాగతం పలికి నమూనా ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం ఆయన స్వామివారి ఊంజల్ సేవలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారు వైకుంఠం నుండి తిరుపతికి వచ్చారని, ఇప్పుడు ఉత్తరాది భక్తుల కోసం మహా కుంభ మేళా నిర్వహించే పవిత్ర స్థలమైన ప్రయాగ్ రాజ్ కు విచ్చేశారని చెప్పారు. భక్తులందరూ శ్రీవారిని దర్శించుకుని వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.