PALLAKI UTSAVAM HELD _ ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో సిరులతల్లి

TIRUPATI, 21 NOVEMBER 2025: The beautifully decorated Sri Padmavati Devi shined as Jaganmohini on the Pallavi Utsavam held on fifth morning of ongoing annual brahmotsavams in Tiruchanoor on Friday.

Braving the incessant drizzles the devotees lined up to witness the divine Universal damsel.

Later at 11:30am Snapana Tirumanjanam will be performed followed by Vasanthotsavam in the evening.

JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, AEO Sri Devarajulu and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో సిరులతల్లి

•  చిరుజల్లుల మధ్య విహరించిన అమ్మవారు

తిరుపతి, 2025, నవంబరు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం చిరుజల్లుల మధ్య, ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. 

అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.

ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. 

మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్స‌వం నిర్వ‌హిస్తారు.

గ‌జ వాహ‌నం

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా రాత్రి 7 నుండి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేష‌మైన గ‌జ వాహ‌నంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.

వాహనసేవలో జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సుభాష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, పలువురు అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.