PALLAVOTSAVAM HELD _ తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

TIRUMALA, 24 JULY 2024: The Birth Anniversary of Maharaja of Mysore was observed with divine fervour with Sri Malayappa flanked by Sridevi and Bhudevi paying a visit to Karnataka Choultries on Wednesday evening in Tirumala.

Popularly known as  Pallavotsavam or Tototsavam, this fete occurs on the advent of Uttarabhadra, the birth star of Maharaja of Mysore every year.

Among the ardent devotees of Sri Venkateswara, Maharaja of Mysore occupies a pride place and has made a huge contribution to Tirumala temple that includes different Vahanams, Ivory Pallaki and many more.

TTD has been observing this fete every year as a tribute to the largesse contributed by Maharaja of Mysore. Even the Pallavotsavam is also said to be in vogue since the last three centuries.

On the occasion, after Sahasra Deepalankara Seva, the Utsava deities reached Karnataka Choultries, where the descendants of Maharaja of Mysore given honours and Harati to the deities.

Temple Peishkar Sri Srihari, Padikavali AEO Sri Mohan Raju, Parupattedar Sri Uma Maheswara Reddy and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

తిరుమల, 2024 జూలై 24 ; తిరుమలలో బుధవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పెష్కర్ శ్రీ శ్రీహరి, పడి కావలి ఏఈఓ శ్రీ మోహన్ రాజు, ఇతర అధికారులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.