PANCHAGAVYA PRODUCTS READY FOR INAUGURATION ON JAN 27 _ జనవరి 27న పంచగవ్య ఉత్పత్తుల ప్రారంభం

Tirupati, 24 Jan. 22: TTD is set to inaugurate 15 Panchagavya products on January 27.

 

TTD JEO Sri Veerabrahmam who inspected plant site at DPW stores on Monday, he said, with the efforts of TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy, TTD has taken up Go protection and promotion on a grand scale.

 

He said as a result, the cow-based Panchagavya products are getting launched on January 27. On the same day, along with the 15 Panchagavya products which are set for the inauguration with the support of the Coimbatore based Ashirvad firm, dry flower technology related products and MoU with different hospitals on cashless treatment to TTD employees will also be carried out, he added.

 

CE Sri Nageswara Rao, Gosala Director Dr Harnath Reddy, VGO Sri Manohar, Additional HO Dr Sunil Kumar were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 27న పంచగవ్య ఉత్పత్తుల ప్రారంభం

ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 24 జనవరి 2022: కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను జనవరి 27 వ తేదీ ప్రారంభిస్తున్నామని జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు.

తిరుపతి డిపిడబ్ల్యు స్టోర్ లోని తయారీ ప్లాంట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీటీడీ గో సంరక్షణకు పెద్ద పీట వేస్తోందన్నారు. ఇందులోభాగంగానే పంచగవ్య ఉత్పత్తుల తయారీకి పూనుకుందని చెప్పారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ప్రత్యేక శ్రద్ధతో తక్కువ సమయంలోనే ఈ ఉత్పత్తుల తయారీ సాకారం అయ్యిందన్నారు. దీంతో పాటు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్ర పటాలు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు కూడా అదే సందర్భంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించడానికి పలు ఆసుపత్రులతో ఎంఓయు కుదుర్చుకోవడం జరుగుతుందన్నారు.

సి ఈ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, విజి ఓ శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది