PANCHAMI THREERTHAM AT TIRUCHANOOR _ శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

Tiruchanoor, 19 Nov. 20: On the last day of ongoing Karthika Brahmotsavam of Goddess Sri Padmavati, Panchami Theertham (chakra snanam) was observed on Thursday morning.

The holy event was conducted at the special water tank set up inside temple during the kumbha lagnam at 11.52am.

Earlier Padmavati Ammavari Pallaki utsavam was performed at the temple and the utsava idol was seated in the vahana mandapam.

Meanwhile the Srivari sare specially prepared for the occasion was brought in a procession from Srivari Temple at Tirumala to Tiruchanoor.

SPECIAL ORNAMENTS FOR AMMAVARU FROM SRIVARI TEMPLE

As part of tradition 112-gram gold medal 249 gram platinum Lakshmi medal and a platinum chain with dashavatara medals were also brought in a procession for decorating Goddesses Padmavati.

Other decorations included various fruits, Pineapple, black can berry, Tulasi and garlands made of orchid flowers and flowery crowns donated by devotees of Tirupur and prepared by artists from Salem.

ATTRACTIVE MANDAPAM OF FRUITS AND FLOWERS

The TTD garden department had decorated the vahana Mandapam with Tamara flowers, apple, and green apple, Roses. Sampangi and six varieties of cut flowers.

Both the senior and junior Pontiffs of Tirupati, TTD chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Addl EO Sri AV Dharma Reddy, Chandragiri MLA Dr. Chevireddy Bhaskar Reddy, Smt Prashanti Reddy, Sri Sampat Ravi Narayana, JEOs Sri P Basant Kumar, Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti and others participated.

PUSHPA YAGAM ON NOV 20

TTD is organising annual Pushpa yagam of Padmavati temple on Friday between 3-5 pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

తిరుప‌తి, 2020 నవంబ‌‌రు 19: సిరుల‌త‌ల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) శాస్త్రోక్తంగా జరిగింది. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న  పుష్కరిణిలో ఉద‌యం 11.52 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి  పల్లకీ ఉత్సవం  ఆలయంలో నిర్వహించారు. అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా వాహన  మండపానికి వేంచేపు చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 9.00 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను  అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు :

ఈ సందర్భంగా 112 గ్రాములు బ‌రువుగ‌ల బంగారు పతకం, 249 గ్రాములు బ‌రువుగ‌ల ప్లాటినం లక్ష్మీ పతకం, దశావతారముల బిళ్లలు కలిగిన  ప్లాటినం చైను సారెతో పాటు  ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

శోభాయ‌మానంగా స్న‌ప‌న‌ తిరుమంజ‌నం

 వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

నెమలి ఈకలు, యాలకులు,  నెల్లి, ఫైనాపిల్, బ్లాక్ క్యాన్ బెర్రీ, లిల్లీ, తులసి, ఆర్కాడ్  పూలతో   రూపొందించిన మాలలు, కిరీటాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

తిరుపూర్ కు చెందిన దాతలు ఈ మాల‌ల త‌యారీకి విరాళం అందించారు. సేలంకు చెందిన కళాకారులు ఈ మాలలను రూపొందిచారు.

ఆకట్టుకున్న ఫలపుష్ప మండపం:

టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్, గ్రీన్ ఆపిల్, రోజా, సంపంగి, ఆరు రకాల కట్ ఫ్లవర్స్ తో వాహన మండ పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

కాగా రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో  ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్ శ్రీ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ దంపతులు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు, బోర్డు స‌భ్యులు, చంద్రగిరి ఎంఎల్‌ఏ డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు,  బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి వి.ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ సంపత్ రవి నారాయణ, జెఈవోలు శ్రీ పి.బసంత్‌కుమార్‌ దంపతులు, శ్రీమతి సదా భార్గవి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్  జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలి రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఝూన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు, అలంకార భట్టార్ శ్రీ ఎం.జి.రామచంద్రన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

న‌వంబరు 20న పుష్పయాగం

న‌వంబరు 20వ తేదీ శుక్ర‌‌వారం ఆలయంలో పుష్పయాగం మధాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు  జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.