PARUVETA UTSAVAM HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

Tirupati, 16 January 2025: The Parveta Utsavam was held in a grand manner at the Sri Govindaraja Swamy temple in Tirupati on Thursday.  

It is customary to hold the festival every year after Kanuma festival.

On this occasion, at 4pm, the Utsavamurti of Sri Govindaraja Swamy along with Sri Govindarajaswamy and Sri Andal Amma was taken in a procession from the temple to the Parveta Mandapam on Renigunta Road.  

The temple court was held there. A large number of devotees flocked to Parveta Mandapam to witness the mock hunt.  

The Utsavamurthies were brought to the temple at 6 pm in a procession through the Mada streets. 

Deputy EO Smt. Shanti, temple priests, other dignitaries and devotees participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం
 
తిరుపతి, 2025 జనవరి 16: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు.  స్వామివారి వేటను తిలకించడానికి పార్వేట మండపానికి విశేష సంఖ్య‌లో భక్తులు విచ్చేసారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు. 
 
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.