PARUVETA UTSAVAM HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా  పార్వేట ఉత్సవం

Tirupati, 16 Jan. 21: Paruveta Utsavam was observed in Ekantam in view of Covid in Sri Govindaraja Swamy temple in Tirupati on Saturday.

 The deities were taken on a procession within temple premises and Asthanam was performed in Kalyana Mandapam.

Spl. Gr. DyEO Sri Rajendrudu and other temple staff members participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా  పార్వేట ఉత్సవం
 
తిరుపతి, 2021 జనవరి 16 : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హించారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకున్నారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు , సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్, శ్రీ వెంక‌టాద్రి,  టెంపుల్ ఇన్సెక్టర్లు‌ శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు తదితరులు పాల్గొన్నారు.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.