PARUVETA UTSAVAM HELD AT RENIGUNTA _ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

Tirupati, 17 Jan. 20: The Paruveta Utsavam of Sri Govinda Raja Swamy was held at Renigunta on Friday with religious pomp and gaiety on the immediate day after Kanuma festival. 

The Utsava deities of Sri Govindaraja Swamy flanked by Sridevi, Bhudevi and Andal Ammavaru were brought to the Paruveta Mandapam located at Renigunta in the evening and Asthanam was performed by the priests as per Agamas. 

Later in the evening, the deities returned to the temple. Spl.Gr.DyEO Smt Varalakshmi and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

 

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుపతి, 2020 జనవరి 17: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు.  తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6.00 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వరలక్ష్మి, ఏఇఓ శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్‌కుమార్‌, శ్రీ శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ‌ మునీంద్రబాబు, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.