PATANJALI YOGA DARSHAN BEGINS AT TIRUMALA _ ప‌తాంజ‌లి మ‌హ‌ర్షి యోగ సూత్ర‌ల‌తో ఆరోగ్య‌క‌ర స‌మాజం

–       HEALTHY SOCIETY IS POSSIBLE WITH YOGA SUTRAS OF MAHARSHI PATANJALI- TTD ADDITIONAL EO

 Tirumala, 10 April 2022: TTD Additional EO Sri AV Dharma Reddy advocated that a healthy and upright society could be achieved by spreading awareness on tenets of Patanjali yoga worldwide.

After completion of Akhanda Vishnu Saharanama Parayanam TTD Additional EO launched the Patanjali Yoga Darshanam. Speaking on the occasion, he said all parayanams conducted by TTD during the last two years had earned a spontaneous response from devotees across the globe.

He said as part of Sri Ramanavami celebrations, Yoga darshan will be there between 6pm and 7pm every day which will be telecasted live on SVBC for global devotees.

Acharya Sri Rani Sadasivamurthy of National Sanskrit University highlighted the values of Patanjali Yoga Darshanam.

Thereafter other eminent speakers like Sri Kuppa Vishwanath Sharma of Sanskrit University, Dr PVNN Maruti of Dharmagiri Veda Vijnan peetham rendered parayanams.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ప‌తాంజ‌లి మ‌హ‌ర్షి యోగ సూత్ర‌ల‌తో ఆరోగ్య‌క‌ర స‌మాజం

తిరుమ‌ల‌లో ప‌తాంజ‌లి యోగద‌ర్శ‌నం ప్రారంభం

– అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 10: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు యోగ సారాన్ని అందించ‌డం ద్వారా ఆయురారోగ్యాలు క‌లిగిన మంచి స‌మాజం ఏర్పాడుతుంద‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అన్నారు. కోట్లాదిమంది మన్ననలు పొందిన విష్ణు సహస్రనామ పారాయణం ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం తిరుమల నాద నీరాజనం వేదిక‌పై ప‌తాంజ‌లి యోగద‌ర్శ‌నం టిటిడి ప్రారంభించింది.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా టిటిడి నిర్వ‌హించిన సుంద‌ర‌కాండ‌, స‌క‌ల కార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం, యుద్ధ‌కాండ‌, బాల కాండ, విరాట‌ప‌ర్వం, గీతా పారాయ‌ణ కార్యక్ర‌మానికి ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భించింద‌న్నారు. శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన్న యోగ దర్శ‌నం సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతంద‌ని చెప్పారు. ఇందులో యోగద‌ర్శ‌నం 45 నిమిషాలు, భ‌గ‌వ‌ద్గీత శ్లోక పారాయ‌ణం 15 నిమిషాలు నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. అదేవిధంగా గరుడ పురాణం, స‌భా పర్వం, అరణ్యపర్వం వంటి ఇతర పారాయ‌ణ కార్యక్రమాలు ఒకటి పూర్త‌యిన తర్వాత ఒకటి ప్రారంభమవుతాయని వివరించారు.

అనంత‌రం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ రాణి స‌దాశివ‌మూర్తి మాట్లాడుతూ భార‌త‌దేశం క‌ర్మ, జ్ఞాన‌, భ‌క్తి, యోగ భూమి అన్నారు. ప‌తాంజ‌లి యోగ శాస్త్రం వ్య‌క్తి, ప‌ర‌మాత్మ‌, జ‌గ‌త్తుగురించి తెలుపుతుంద‌న్నారు. జీవికి ప‌ర‌మాత్మునికి మ‌ధ్య ఉన్న సంబంధం నుండి యోగ శాస్త్రం ఉద్భ‌వించిద‌ని తెలిపారు. క‌ర్మ యోగి, జ్ఞాన యోగి, భ‌క్తి యోగి కావాలంటే యోగ శాస్త్రం వ‌ల్ల సిద్ధిస్తుంద‌ని చెప్పారు. భ‌గ‌వంతుని చేరుకోవాడానికి ఉన్నద‌ర్శ‌నాల‌లో యోగ ద‌ర్శ‌నం ఒక్క‌ట‌ని, యోగ ద‌ర్శ‌నం ద్వారా మ‌న‌వ‌ల్ని మ‌నం సంస్క‌రించుకుని ఎలా ముక్తిని పొందాలి అనే అంశాలు యోగ శాస్త్రం తెలియ‌జేస్తోంద‌ని వివ‌రించారు.

త‌రువాత‌ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వ‌నాధ శ‌ర్మ ప్ర‌వ‌చ‌నాలు, తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు డాక్ట‌ర్ పివిఎన్ఎన్ మారుతీ శ్లోక పారాయ‌ణం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.