PATANJALI YOGA DARSHANAM TO COMMENCE ON SRI RAMA NAVAMI DAY _ ఏప్రిల్ 10 నుండి తిరుమలలో పతాంజలి యోగ దర్శనం
ADDL EO REVIEWS ON THE ARRANGEMENTS FOR
SRINIVASA KALYANAM AT CHENNAI ON APRIL 16
TIRUMALA, 06 APRIL 2022: As the much-acclaimed Vishnu Sahasranama Parayanam is going to conclude on April 9, TTD is all set to commence yet another new Parayanam-Patanjali Yoga Darsanam from April 10onwards.
Renowned scholar Sri Kuppa Viswanatha Sharma who won accolades across the globe for his oratory skills on Bhagavat Gita will deliver the new Parayanam which commences on the auspicious day of Sri Rama Navami at the Nada Neerajanam platform in Tirumala.
The additional EO reviewed with the medic scholars of Dharmagiri, National Sanskrit University at Annamaiah Bhavan in Tirumala on Wednesday evening.
Dharmagiri Veda Vignana Peetham Principal Sri Kuppa Siva Subramanya Avadhani, Prof Sadasiva Murty, DyEO Rama Rao, All Projects Program Officer Sri Vijayasaradhi and others were also present while Sri K Viswanatha Sharma participated virtually.
Earlier coordination meeting with all department HoDs in Tirumala held which reviewed on the status of development works.
Later the Additional EO also discussed on the arrangements to be made for Sri Srinivasa Kalyanam at Chennai on April 16.
Pradhana Archakas Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, Sri Govinda Deekshitulu, SE 2 Sri Jagadeeshwar Reddy and other HoDs were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 10 నుండి తిరుమలలో పతాంజలి యోగ దర్శనం
తిరుమల, 2022 ఏప్రిల్ 06: తిరుమల నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 10వ తేదీ నుండి పతాంజలి దర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అదనపు శ్రీ ఎవి.ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ధర్మగిరి వేద విజ్ఙాన పీఠం, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులతో అదనపు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా టిటిడి నిర్వహించిన సుందరకాండ, సకల కార్యసిద్ధి శ్రీమద్ రామాయణ పారాయణం, యుద్ధకాండ, బాల కాండ, విరాటపర్వం, గీతా పారాయణ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తుల నుండి విశేష ఆదరణ లభించిందన్నారు. ఈనెల 9వ తేదీకి విష్ణు సహస్రనామ పారాయణం పూర్తవుతుందని దాని స్థానంలో శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్న సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు యోగ దర్శనం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు భగవద్గీత శ్లోక పారాయణం నిర్వహిస్తారని చెప్పారు. అదేవిధంగా గరుడ పురాణం, సభా పర్వం, అరణ్యపర్వం వంటి ఇతర పారాయణ కార్యక్రమాలు ఒకటి పూర్తయిన తర్వాత ఒకటి ప్రారంభమవుతాయని వివరించారు.
కాగా అంతకుముందు ప్రతి నెలా నిర్వహించే అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయా విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు.
ఏప్రిల్ 16న చెన్నైలో శ్రీనివాస కళ్యాణం : పర్వదినాన్న
టిటిడి ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు అదనపు ఈవో తెలిపారు. శ్రీవారి కళ్యాణానికి ఆయా విభాగాలు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల్ దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎస్ఇ – 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఎస్వీబిసి సిఈవో శ్రీ సురేష్ కుమార్, జియం శ్రీ శేషారెడ్డి, ఇతర విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.