PATTABHI RAMA ON HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
Tirupati, 01 December 2024: On the fourth evening, Sri Padmavati devi in Pattabhi Rama Alankaram blessed devotees on Hanumanta Vahanam.
The ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor witnessed the Goddess in the guise of Sri Pattabhi Rama taking a celestial ride on Hanumanta Vahanam along four mada streets on Sunday.
Both the senior and junior pontiffs of Tirumala, EO Sri J Syamala Rao, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, Archaka Sri Babu Swamy and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
తిరుపతి, 20224 డిసెంబరు 01: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు అభయమిచ్చారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు . రాత్రి 7 నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు.త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.
టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం కలిసి డిసెంబర్ 6న పద్మ సరోవరంలో జరుగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ శ్యామల రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.